విజయవాడ నగరం దేశంలోనే అత్యంత ప్రముఖ నగరాల్లో ఒకటి. కానీ నగర విస్తరణ మాత్రం పెద్దగా జరగడం లేదు. కారణం ఏమిటో కానీ ఇటీవల మాత్రం కొద్ది కొద్దిగా విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నగరం బయట కూడా వస్తున్నాయి. ఇందులో తాడిగడప వైపు ఎక్కువ గా నగరం విస్తరిస్తోంది. కానూరు, తాడిగడప, పోరంకి, యనమలకుదురు పంచాయతీలను కలిపి తాడిగడప మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు అయినా మున్సిపాలిటీ పరంగా చేపట్టాల్సిన పనులేమీ చేపట్టలేదు.
ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితుల్లో మార్పు పచ్చింది. మౌలికసదుపాయాలు పెరుగుతున్నాయి. దీంతో చిన్నచిన్న బిల్డర్లు వెంచర్లు వేస్తున్నారు. అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ప్లాట్లు అమ్ముతున్నారు. అన్ని అనుమతులతో ఉన్న వెంచర్లకే వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడకు వచ్చి ఎంక్వయిరీలు చేసేవారు పెరిగారు. నాలుగు నెలల కిందట ఇక్కడ ఇరవై లక్షలకూ పెడితే ఇంటి స్థలం వచ్చేది . ఇప్పుడు అది ముఫ్పై లక్షల వరకూ పలుకుతోంది.
అపార్టుమెంట్లు కూడా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటున్నాయి. యాభై కల్ల వరకూ పెట్టుకుంటే అన్ని సౌకర్యాలు ఉన్న విశాలమైన అపార్టుమెంట్ లభిస్తోంది. ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. విజయవాడ నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. గ్రేటర్ విజయవాడగా మారిస్తే ఎక్కువగా లబ్దిపొందేది తాడిగడప ప్రాంతమే. ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. నివాసాలకు అనుకూలంగా మారుతుంది. అందుకే తాడిగడప వైపు ఎక్కువ మంది ఎంక్వయిరీలు చేస్తున్నారు.