హైదరాబాద్‌లో కట్టిన లక్షణ ఇళ్లు చూపిస్తానంటూ హడావుడి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్… గ్రేటర్లో లేని పక్క నియోజకవర్గాల్లో ఉన్న ఇళ్లను చూపించడానికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని150 డివిజిన్లలోఎక్కడ కట్టినా చూపించాలని పట్టుబట్టడంతో తలసాని అసహనానికి గురై భట్టిని వదిలేసివెళ్లిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు చూపించమంటే.. పక్క నియోజకవర్గాల్లో ఇళ్లు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క తలసానిపై అసహనం వ్యక్తంచ ేశారు. తలసాని వెళ్లిపోవడంపై భట్టి మండిపడ్డారు. ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయింద్నారు.
హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టకుండా.. ఇతర చోట్ల కట్టిన లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని .. 5 నియోజకవర్గాల్లో కేవలం 3,400 ఇళ్లే కట్టినట్లుగా తేలిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలని.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. లక్ష ఇళ్లు నిర్మించే వరకు ప్రభుత్వం వెంట పడతామని స్పష్టంచేశారు. భట్టితో పాటు కాంగ్రెస్ బృందాన్ని వదిలేసిన తలసాని ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మిస్తున్న ఇళ్లవద్దకు వెళ్లారు. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ చూపిస్తున్నా .. ఓర్వలేక కాంగ్రెస్ నేతలు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో చేసిన సవాల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భట్టి ఇంటికి వెళ్లిన తలసాని…ఇళ్లను పూర్తిగా చూపించకుండానే మధ్యలో వెళ్లిపోయి… కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చారు. చూపించడానికి లక్ష ఇళ్లు లేకనే…విమర్శలు చేస్తున్నారని… ఇళ్లు చూపిస్తే తాము ఎప్పుడైనా వస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. తలసాని … చేసిన హాడవుడి.. ఇళ్ల విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి మరింత పెరిగేలా ఉంది కానీ..రాజకీయంగా ఉపయోగపడేలా లేదన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వినిపిస్తోంది.