సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి కోసం చేస్తున్నారో… రాజకీయ గురువు అయిన చంద్రబాబుకు.. నెగెటివ్ వేలో అయినా మేలు చేసే చాన్స్ వచ్చిందని.. సంతోష పడుతున్నారో కానీ.. ఇతర టీఆర్ఎస్ నేతలెవరూ.. స్పందించనంత అతిగా .. ఏపీ రాజకీయాలపై స్పందిస్తున్నారు. కోడి పందేల కోసం అంటూ ఏపీకి వచ్చి .. వైసీపీ నేతలందర్నీ వెంటేసుకుని.. .కాస్త హడావుడి చేసి… రాజకీయ ప్రకటనలు చేసిన తలసాని… హైదరాబాద్ వెళ్లిన మరింత రెచ్చిపోయారు. ఏపీ రాజకీయ నేతలు దద్దమ్మలన్నట్లుగా మాట్లాడేశారు. కోడిపందేల దగ్గర రాజకీయాలు మాట్లాడేసిన తలసానిని.. టీడీపీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ.. కనక దుర్గమ్మను దర్శించుకుని.. ఆలయం ముందు… రాజకీయాలు మాట్లాడారు. కొద్దిరోజుల కిందట తిరుమలకు వెళ్లి శ్రీవారి ఆలయం ముందు కూడా మాట్లాడారు. అప్పుడే విమర్శలు వచ్చినా… కనకదుర్గమ్మ ఆలయం ముందు మరింత పరిధి దాటారు.
ఇప్పటి వరకూ… తెలంగాణ నేతలు… ఏపీకి అతిధుల్లాంటి వాళ్లు.. వాళ్లపై ఘాటుగా స్పందిస్తే.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని.. అధికార పార్టీగా.. ఆ మాత్రం సంయమనం పాటించాలని… టీడీపీ నేతలు… పద్దతిగా సమాధానం చెబుతూ వస్తున్నారు. కానీ.. గుడి ముందే… తలసాని రాజకీయ విమర్శలు చేయడంతో…. చంద్రబాబు కూడా పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు తలసాని వియ్యంకుడు. పుట్టా సుధాకర్ యాదవ్ కు.. యనమల వియ్యంకుడు. ఆయనకు ఇద్దరు టీడీపీ ముఖ్యనేతలతో సంబంధాలు ఉండటం కూడా… ఏపీ టీడీపీ నేతలు నోరు మెదకపోవడానికి మరో కారణం. బంధుత్వాలు ఇంట్లో చూసుకోమని చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పర్యటనలు వచ్చే వారితో టీడీపీ నేతలు.. కలవొద్దని హెచ్చరించారు.
చంద్రబాబు తన పార్టీ నేతలకు… ఇచ్చిన హెచ్చరికలపై.. హైదరాబాద్ లో తలసాని మరోసారి చెలరేగిపోయారు. ఏపీ టీడీపీ నేతలు దద్దమ్మలంటూ.. వ్యాఖ్యానించారు. అందులో ఆయన బంధువులు ఉన్నారో లేదో ప్రత్యేకంగా చెప్పలేదు. ఏపీ అభివృద్ధి అంతా ఏమీ లేదని.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో.. కేసీఆర్ .. విజయవాడ వచ్చి వివరిస్తారంటూ.. చాలా చాలా మాటలు అన్నారు. తలసాని మాటలు …. ఏపీ ప్రజల్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఈ మాటల్ని సాక్షి మీడియా కూడా ప్రసారం చేయడానికి మొహమాట పడుతోంది. అందరూ కలిసి… చంద్రబాబుకు గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమోనని.. ఆ దెబ్బకు తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన… వైసీపీ వర్గాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమయింది. తలసాని లాంటి్ వాళ్లు ముగ్గురు, నలుగురు ఉంటే చాలని… టీడీపీ నేతలు మరింత రెచ్చగొట్టడానికి సిద్ధమవుతున్నారు.