సౌత్ క్రేజీ బ్యూటీ తమన్నా తెలుగు తమిళ భాషల్లో వరుసెంట సూపర్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫాంలో ఉంది. ఇక బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సంపాదించింది మిల్కీ బ్యూటీ. సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరికైనా బాలీవుడ్ మీద మక్కువ ఎక్కువే.. ఇక్కడ స్టార్ స్టేటస్ ఉన్నా అక్కడ అవకాశం రాగానే చెక్కేస్తారు. అయితే తమన్నా కూడా హిమ్మత్ వాలా సినిమాతో బీ టౌన్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అందరి సౌత్ హీరోయిన్స్ లానే తాను కూడా అక్కడ క్లిక్ అవ్వకపోయే సరికి ఇక్కడ సినిమాలే చేసుకుంటూ పోతుంది. అయితే బాహుబలి పుణ్యమాని తమన్నాకు రణ్ వీర్ సింగ్ తో జోడి కట్టే ఆఫర్ వచ్చింది.
రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా నటించేందుకు గాను ఆమెకు 4 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో భారీ డిమాండ్ ఉన్న ఈ భామ మా అంటే కోటిన్నర కంటే ఎక్కువ తీసుకున్నది లేదు. కాని బాలీవుడ్ అనే సరికి రెమ్యునరేషన్ పెంచేసింది. అయితే అమ్మడు అడిగినంత ఇవ్వడానికి ఒకే చెప్పిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు తమన్నాను ఫుల్ గా వాడేందుకు సిద్ధమయ్యారట. అసలే యువ హీరోల్లో జోష్ మీదున్న రణ్ వీర్ తన సరసన ఏ హీరోయిన్ నటించినా ఆమెతో ముద్దుల వర్షం ముంచెత్తుతున్నాడు. మరి తమన్నాతో కూడా ఆ రేంజ్ లిప్ లాక్స్ ఉంటాయా లేదా అన్నది చూడాలి. రెమ్యునరేషన్ డబుల్ అయ్యింది కాబట్టి గ్లామర్ షో కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి తమన్నా అందాలతో రాబోయే రోహిత్ శెట్టి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.