ఈమధ్య తమన్నా పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. చేస్తున్న సినిమాలూ, ఐటెమ్ సాంగుల మీద వస్తున్న గాసిప్పులు మామూలేగానీ… తమన్నా పెళ్లి వార్త మాత్రం.. టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. తమన్నా ఓ కుర్రాడిని డీప్‌గా ప్రేమిస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని ఆ వార్తల సారాంశం. వీటిపై తమన్నా కూడా నోరు విప్పింది. ”పెళ్లిపై నాకు గౌరవం ఉంది. తప్పకుండా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొంటా. అయితే ఇప్పుడు కాదు. దానికింకా టైముంది” అంటోంది. ప్రేమలో పడిన వార్తలు కూడా పుకార్లేనట.
”నా కెరీర్‌ని గమనించండి. ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నటిస్తూనే ఉన్నాను. ఇక ప్రేమించే తీరిక ఎక్కడ? ప్రేమలో పడ్డాననడం కేవలం పుకార్లే. దయచేసి ఇలాంటి పుకార్లు నమ్మొద్దు. ఇప్పుడు నా కెరీర్ మరింత స్ట్రాంగ్‌గా ఉంది. దానిపైనే నా ధ్యాసంతా” అంటూ… గాసిప్పులపై క్లారిటీ ఇచ్చిందీ మిల్కీ బ్యూటీ. సో.. తమన్నా పెళ్లి ఉత్త పుకారే అన్నమాట.