తమన్నా గురించి ఎవరు మాట్లాడినా… ‘పక్కా.. ప్రొఫెషనల్ కథానాయిక’ అంటుంటారు. నటన, ఆమె టైమింగ్స్, సెట్స్‌లో చూపించే సిన్సియారిటీ, సినిమాపై ఆమెకుండే ప్రేమ… ఇవన్నీ తమన్నాని ప్రొఫెషనల్ హీరోయిన్గా మార్చేశాయి. మీడియా ముందు కూడా తమన్నా ఆచి తూచి మాట్లాడుతుంది. అయితే.. ఈమధ్య తమన్నా కాస్త కంట్రోల్ తప్పేస్తోంది. ఏది అనుకొంటే.. అదే మాట్లాడుతుంది. ఎవరేమైనా అనుకొంటారేమో.. అన్న ఆలోచన కూడా లేదు. బహుశా… పదేళ్ల సీనియారిటీ వచ్చేసింది కదా. పెద్దదాన్నయిపోయా అనుకొంటుందేమో.
నేటితరం దర్శకులపై తమన్నా ఓ సెటైర్లాంటిది వేసింది. ”కొంతమంది దర్శకులు ఒకటి చెప్పి, మరోటి తీస్తున్నారు. అలాంటి దర్శకులు నాక్కూడా తగిలారు. వాళ్లతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. మొహమాటానికి ఒప్పుకొన్న సినిమాలేం లేవుగానీ.. ఇలా మోసపోయిన సినిమాలైతే ఉన్నాయి..సస అంటూ వాపోతోంది తమన్నా. తనకు మంచి క్యారెక్టర్లు పడ్డా… అది సీన్ పేపర్ వరకే పరిమితమైందని, తెరపై చూసుకొనేసరికి తన పాత్ర మరోలా తయారైంద”ని ఆవేదన వ్యక్తం చేస్తోంది తమన్నా. మరింతకీ ఆ దర్శకులెవరో, తమన్నాని మోసం చేసిందెవరో మాత్రం చెప్పలేదు. మీకేమైనా తెలుసా??