ప్రముఖ కథానాయిక తమన్నాకు కరోనా సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తమన్నా చికిత్స తీసుకుంటోంది. ఈనెల 1న ఓ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చింది తమన్నా. అప్పటి నుంచీ తీవ్ర జ్వరంతో బాధపడుతోందట. కోవిడ్ లక్షణాలు కూడా కనిపిస్తుండడంతో.. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంది. దాంట్లో పాజిటీవ్ గా తేలింది. వెంటనే.. ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటోంది. తమన్నా తల్లిదండ్రులకు ఇది వరకే కరోనా సోకింది. అప్పుడే తమన్నా హోం క్వారెంటైన్లోకి వెళ్లి, జాగ్రత్త పడింది. ఆ తరవాత తమన్నా తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆ ధైర్యంతోనే తమన్నా కూడా షూటింగులకు ఒప్పుకుంది. తీరా చూస్తే.. ఇప్పుడు తమన్నాకీ కరోనా సోకింది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న `సిటీమార్` షూటింగ్ నిమిత్తమే తమన్నా హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి తమన్నా సెట్లో అడుగుపెట్టాల్సివుంది. తమన్నా కి కోవిడ్ సోకడంతో ఇప్పుడు ఆ షూటింగ్ నీ వాయిదా వేశారు.