హిందీ దర్శకుడు కునాల్ కోహ్లీ తీసిన తెలుగు సినిమా ‘నెక్ట్స్ ఏంటి?’. ఒకవేళ సినిమా పరాజయమైతే… ‘సందీప్ కిషన్‌కి నెక్ట్స్ సినిమా రావడం కష్టమే, సినిమాకు అతడే మైనస్’ కామెంట్ చేసినవాళ్లకు కొదవ లేదు. ఈ సినిమాకు సందీప్ కిషన్ మైనస్సా? ప్లస్సా? అనేది పక్కన పెడితే… ఈ రోజు (మంగళవారం) విడుదల చేసిన ‘ఓ నో నెవర్’ వీడియో సాంగ్ మాత్రం తమన్నాకు మైనస్సే! మేకప్ సెట్ కాలేదో? మరొకటో? ఆమె లుక్స్ ఆకర్షణీయంగా లేవు. నిజానికి, ఈ పాటలో తమన్నా ప్రతి డ్రస్సు మొకాళ్లపైకి వుంది కానీ… ఏదీ కిందకు దిగలేదు. ప్రతి డ్రస్ అలా్ట్ర మోడరన్ గ్లామర్ డ్రస్సే. బట్టలను పొదుపుగా వాడారు. కానీ, ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేలా సాంగ్ తీయడంలో దర్శకుడు, కొరియోగ్రాఫర్ సక్సెస్ కాలేకపోయారు. దీనికి తోడు తమన్నా కాస్త ఒళ్లు చేయడం, ఆ ఎర్ర జుట్టు వింతగా వున్నాయి. తమన్నా ఏమో మరీ తెల్లగా… సందీప్ కిషన్ కాస్త నల్లగా వుండటంతో ఇద్దర్నీ జంటగా చూడటం ఒకింత ఇబ్బందిగానే వుంది. సినిమాటోగ్రఫీ చూస్తుంటే సినిమాను తక్కువ బడ్జెట్లో చుట్టేశారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రేక్షకుల్లో సినిమాపై క్రేజ్ తీసుకురావడానికి ‘నెక్ట్స్ ఏంటి?’ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. డిసెంబర్ 7న సినిమాను విడుదల చేస్తున్నారు.