తమన్నా టాప్ లీగ్ హీరోయిన్. దాదాపు బడా హీరోలందరితోనూ చేసింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా దాదాపు స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే ఒక్కసారిగా ఆమెకు అపజయాలు చుట్టుముట్టాయి. ‘ఆగడు’ సినిమా ఫ్లాఫ్ తర్వాత దాదాపు పెద్ద హీరోల సరసన కనిపించే అవకాశమే దక్కలేదు. మధ్యలో చిరంజీవి ‘సైరా’ లో అవకాశం దక్కింది. అందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది కానీ సినిమా మాత్రం ఊహించిన విజయం సాధించలేదు.
అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి సినిమా ఆఫర్ వచ్చింది. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా కి అవకాశం వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది తమన్నా. ‘ఈ మెగా మాస్““ చిత్రంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది. చిరంజీవి సర్‌తో మరోసారి వెండితెరను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. మొత్తానికి మరో మెగా మూవీ లో కనిపించే ఛాన్స్ అందుకుంది తమన్నా. మరి ఈ సినిమాతో తమన్నాకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందేమో చూడాలి.