లాక్ డౌన్ సమయంలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల 2’ చేస్తున్నారు. తమన్నా లీడ్ రోల్. ఈ రోజు టీజర్ ని వదిలారు. క్షుద్ర శక్తులు, హారర్ ఎలిమెంట్స్, తాంత్రిక విద్యలు, డివైన్ పవర్ ఎలిమెంట్స్ మిళితం చేసిన ఈ టీజర్ ఆసక్తికరంగానే వుంది.
డైలాగ్స్ లేకుండా కేవలం థీం సాంగ్ తో టీజర్ విజువల్స్ ని చూపించారు. కొన్ని షాట్స్ టెర్రిఫిక్ గా వున్నాయి. క్షుద్ర, తాంత్రిక శక్తులు పట్టిపీడుస్తున్న ఓ ప్రాంతంలోకి నాగసాధు గా తమన్నా ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆటలు కట్టిస్తుంది. టీజర్ లో కన్వే అయిన పాయింట్ ఇదే. తమన్నాది అఖండలో బాలయ్య టైపు పవర్ ఫుల్ పాత్ర. తన గెటప్ లుక్ బాగా సెట్ అయ్యింది.
ఓదెల చిన్న సినిమా. కానీ ఓదెల2 కి వచ్చేసరికి స్కేల్ పెరిగిందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. క్యాలిటీ ప్రొడక్షన్ కనిపించింది. అజనీష్ లోక్నాథ్ బీజీఎం ఆకట్టుకునేలా చేశాడు. ఈ సినిమాకి సంపత్ నంది షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. కథ స్క్రీన్ ప్లే మేకింగ్.. అన్నిట్లోనూ ఆయన హ్యాండ్ వుంది. సినిమాపై క్యురియాసిటీ పెంచడంలో టీజర్ సఫలమైనట్లే. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.