కథానాయకుడు విశాల్ పెళ్లికి రెడీ అయ్యాడు. ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. 2018 జనవరి 15న విశాల్ పెళ్లి చేసుకొంటున్నాడు. ఈ డేట్ విశాల్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. చెన్నైలో విశాల్ ఓ కల్యాణమండపం నిర్మిస్తున్నాడు. 2018 జనవరి 14న ఆ కల్యాణమండపాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు.. విశాల్ అదే మండపంలో పెళ్లి చేసుకొంటున్నాడు. అయితే పెళ్లి కూతురు ఎవరన్నది ఇంకా చెప్పడం లేదు. ”నేను ఓ కల్యాణమండపం నిర్మిస్తున్నాను. ఆ పనులు మొదలయ్యాయి. 2018 జనవరి 14న ప్రారంభించాలనుకొంటున్నాం. ఆ కల్యాణమండపంలో జరిగే మొదటి పెళ్లి నాదే. అయితే పెళ్లికూతురు ఎవరో నాకూ తెలీదు” అంటున్నాడు. విశాల్ గత కొంతకాలంగా వరలక్ష్మి తో లవ్ మేటర్ నడుపుతున్నాడు. తననే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిపై విశాల్ స్పందించడం లేదు. పెళ్లి కూతురు ఎవరైనా సరే.. విశాల్ పెళ్లి డేటు మాత్రం ఖాయమైపోయింది.