రామ్ పోతినేని కొత్త సినిమా పట్టాలెక్కింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇది నిర్మితం కానుంది. భాగ్యశ్రీ హీరోయిన్. ఇటివలే పూజా కార్యక్రమం జరిగింది.
ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కాస్త కొత్తగా అలోచించారు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తమిళ్ నుంచి తీసుకొచ్చారు. వివేక్-మెర్విన్గా పాపురలైన వివేక్ శివ, మెర్విన్ సోలమన్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ తో తమిళ్ లో పేరుతెచ్చుకున్న ఈ జోడి ధనుష్ పట్టాస్ సినిమాకి పని చేశారు. ఇప్పుడు రామ్ సినిమాతో తెలుగులో వస్తున్నారు.
‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత రామ్ నటిస్తోన్న చిత్రమిది. రామ్ 22వ సినిమాగా ఇది సిద్ధమవుతోంది. స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి వరుస మాస్ సినిమాలు చేసిన రామ్ ఈ కొత్త సినిమాకి జోనర్ మార్చారు. న్యూ ఏజ్ కంటెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అందుకుతగ్గట్టే సంగీతంలో కూడా కొత్తదనం చూపించేలా ఈ యువ సంగీత ద్వయాన్ని ఎంచుకున్నారు.