నయనతార కవల పిల్లలకు తల్లైంది. అయితే.. ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సరోగసీ ద్వారా నయన తల్లవడం వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు లీగల్ గానూ నయన చుట్టూ ఉచ్చు బిగుసుకొంటోంది. నయన సరోగసీ ద్వారా తల్లి అవ్వడం చట్ట బద్ధంగా జరిగిందా? లేదా? అనేది విచారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల పాటు నివేదిక ఇవ్వాలి. అందుకోసం నయన తార. విఘ్నేష్‌లు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నయన అద్దెగర్భానికి సహకరించిన వాళ్లెవరు? అనే విషయంపై లోతైన విచారణ జరుగుతోంది. కేరళకు చెందిన ఓ యువతి… సరోగసీ ద్వారా బిడ్డల్ని కని, నయనతారకు అప్పగించిందని విచారణలో తేలింది. ఆమె నయనకు స్నేహితురాలని తెలుస్తోంది. నయన కేరళలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అదే కాలేజీలో చదివిన తన స్నేహితురాలితోనే.. నయన కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. సరోగసీ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నయన తార అతిక్రమించిందన్నది ప్రధాన ఆరోపణ. అదే నిజమైతే.. పది సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు… నయనతార కూడా కొంతమంది న్యాయ వాదుల్ని సంప్రదిస్తోందట. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి? అనే విషయంపై తీవ్రంగా మంతనాలు జరుపుతోందని సమాచారం.