తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం బంద్ కొనసాగుతోంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్యతోపాటు థియేటర్ లకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం బంద్ జరుగుతోంది. అయితే అనూహ్యంగా ఇది రాం చరణ్ రంగస్థలం సినిమాకు కలిసొస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఒక నెల కిందట తెలుగు పరిశ్రమను లో కూడా బంద్ జరిగింది. అయితే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తో నిర్మాతల చర్చలు ఫలించడంతో బంద్ కి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు ఇదే సమస్య పై తమిళనాట బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కారణంగా తమిళనాట విడుదల కావాల్సిన తమిళ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఏ తమిళ సినిమాని కూడా ప్రదర్శించడానికి వీల్లేదు. సినిమా ప్రదర్శనలతో పాటు షూటింగులు కూడా వాయిదా వేసుకున్నారు. అయితే, విదేశాల్లో షూటింగ్ ఉన్నవాళ్ళకి వెసలుబాటు ఇచ్చారు – మళ్ళీ వీసాలు తెచ్చుకోవడం ఇవన్నీ కష్టం కనుక.
అయితే సినిమా ప్రదర్శనలో నూ చిన్న వెసలుబాటు ఇచ్చారు- మిగతా భాషల సినిమాలని ప్రదర్శించడానికి అభ్యంతరం లేదు అంటూ. ఈ వెసలుబాటు కారణం గా చెన్నైతో పాటు తెలుగువారు బాగానే ఉండే ప్రాంతాలలో థియేటర్ల యజమానులు “రంగస్థలం” ప్రదర్శిస్తున్నారు. దీంతో అనూహ్యంగా రంగస్థలం సినిమాకు తమిళనాట
అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ వసూళ్ళు వస్తున్నాయి.
అయితే ఒక ఐదు రోజుల తర్వాత తెలుగు సినిమాలకి ఉన్న వెసలుబాటు కూడా తీసివేయనుండటం తో పరిస్థితి మళ్ళీ మొదటికి రావచ్చు.
https://www.telugu360.com/te/telugu-movies-bandh-in-tamil-nadu-from-sunday/
అయితేనేం, దాదాపు పది రోజులు రంగస్థలం తమిళనాట హవా కొనసాగించినట్టు అవుతుంది. ఏది ఏమైనా టైం బాగున్నప్పుడు అన్నీ ఇలా కలిసొస్తాయని రాం చరణ్ గురించి అనుకుంటున్నారు.