సినిమా కోసం లక్షల్లో పారితోషికం తీసుకొంటారు… తీరా ప్రమోషన్లకోసం రమ్మకంటే మొహం చాటేస్తారు. చాలామంది కథానాయికల పరిస్థితి ఇంతే. దాంతో నిర్మాతలు ఆ బాధ బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక సతమతమవుతుంటారు. అయితే ఓ నిర్మాత మాత్రం హీరోయిన్‌పై చిరుబుర్రులాడుతున్నాడు. ప్రమోషన్లలో పాల్లోనందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ.. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ నిర్మాతకు ఇబ్బంది కలిగించిన కథానాయిక ఎవరో కాదు.. హన్సిక.
జీవాతో కలసి హన్సిక నటించిన తమిళ చిత్రం పోకిరి రాజా. సెల్వకుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా విడుదలై అట్టర్ఫ్టాప్ అయ్యింది. దాంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడీ నిర్మాత. ఇప్పుడు హన్సికపై ఫిల్మ్‌ఛాంబర్‌లో పిర్యాదు చేసి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. హన్సిక ప్రమోషన్లలో సరిగా సహకరించలేదని, ఆఖరికి ఆడియో ఫంక్షన్‌కీ డుమ్మా కొట్టిందని, ఆడియో ఫంక్షన్‌ని హన్సిక వస్తుందనుకొని లక్షల్లో ఖర్చుపెట్టానని, ఆ నష్టాన్ని హన్సికనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడీ నిర్మాత. ఈ విషయం గురించి హన్సికతో మాట్లాడదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడీ నిర్మాత. ప్రస్తుతం ఈ కేసు చెన్నై ఫిల్మ్ ఛాంబర్ పరిధిలో ఉంది. వాళ్లు హన్సికపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారో లేదో చూడాలి. ఒకవేళ నష్టపరిహారం చెల్లించాల్సిందే అని తీర్పునిస్తే.. చాలామంది కథానాయికలకు చెంపపెట్టులాంటి వార్త అవుతుంది.