ఎన్టీఆర్ – కొరటాల శివ.. జనతా గ్యారేజ్ క్రేజ్రోజు రోజుకీ పెరుగుతుంది. టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళ చిత్రసీమ కూడా జనతా గ్యారేజ్కోసం వేయి కళ్లలో ఎదురుచూస్తోంది. బాహుబలి తరవాత తెలుగు సినిమాలకు తమిళ నాట బాగా క్రేజ్ పెరిగింది. సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం నిరాశ పరిచినా.. తెలుగు సినిమా క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఇప్పుడు జనతా గ్యారేజ్ కోసం కూడా తమిళ నిర్మాతలు వరుస కడుతున్నారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాని ఒకేసారి విడుదల చేయాలని జనతా గ్యారేజ్ టీమ్ భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే తమిళ నిర్మాతలు కూడా పోటెత్తుతున్నారు. ఈమధ్య ఓ అగ్ర నిర్మాణ సంస్థ క్రేజీ ఆఫర్‌తో వచ్చిందట.
రూ.10 కోట్లకు జనతా గ్యారేజ్ థియేటరికల్ రైట్స్ ఇవ్వమని బేరం పెట్టిందట. సాధారణంగా ఎన్టీఆర్ సినిమా అక్కడ రూ.4 కోట్లకు మించి అమ్ముడవ్వదు. అయితే జనతా గ్యారేజ్‌కి రెండున్నర రెట్లు అధికంగా రావడం… చిత్రబృందాన్ని షాక్ కి గురిచేసింది. సర్దార్, బ్రహ్మోత్సవం తమిళ నాట తుస్సుమన్నాయి. అందుకే… జనతాకి డిమాండ్ తగ్గుద్దేమో అనుకొన్నారు.కానీ.. తమిళ నిర్మాతలు తగ్గడం లేదు. దాంతో జనతా గ్యారేజ్.. రూ.10 కోట్లకు తమిళ రైట్స్ అమ్మేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పది కోట్లంటే మంచి ఫిగరే.