తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ పై సంతకం పెట్టారు. ఫిబ్రవరి మూడు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మూడున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు. బడ్జెట్ పెట్టే చాన్స్ లేదు. దీంతో . రెండు రోజుల విరామం తర్వాత 6 న బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్తో సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు మూడు సెషన్లుగా ప్రోరోగ్ చేయలేదు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగుతాయని ప్రకటించారు. ఈ కారణంగానే గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. గత ఏడాది కూడా ఇదే వాదన వినిపించారు. ఇప్పుడు హైకోర్టుకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి అంగీకారం తెలిపినందున మళ్లీ ప్రోరోగ్ చేసి సమావేశం జరపాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులతో సీఎం కేసీఆర్.. సభను ప్రోరోగ్ చేసి మళ్లీ నిర్వహించడానికి అసెంబ్లీ సమావేశాలను ఓ వారం పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఒక వేళ అలా చేయాల్సిన పని లేదు.. నేరుగా గవర్నర్తో ప్రసంగం చేయించవచ్చని అనుకుంటే.. గత ఏడాది తప్పు చేసినట్లుగా ప్రభుత్వం అంగీకరించినట్లు అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎలా అయినా గవర్నర్ ప్రసంగాన్ని మూడో తేదీనే ఏర్పాటు చేస్తే.. ఆ రోజు ప్రవేశ పెట్టాలనున్న బడ్జెట్ను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనికే మొగ్గు చూపింది. గవర్నర్ తో వివాదాన్ని ఇంటితో ముగిస్తారా లేదా అన్నదానిపై ఒకటి.. రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.