తెలంగాణ గవర్నర్ తమిళిశై… సీఎం కేసీఆర్కు మరోసారి షాకిచ్చారు. పెండింగ్ బిల్లులను ఆమోదించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారమ జరగాల్సిన రోజే.. బిల్లలను పరిష్కరించారు. మొత్తం పది బిల్లులు రాజ్ భవన్ లో పెండింగ్లో ఉన్నాయి. మొత్తం పది బిల్లుల్లో కేవలం మూడింటికి మాత్రమే ఆమోదం తెలిపారు రెండింటిని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ తిరస్కరించారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో రెండింటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఇటీవల బడ్జెట్ సమవేశాలకు ముందు బడ్జెట్ను గవర్నర్ ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది. చివరికి తానే వెనక్కి తగ్గింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపడంతో సమస్య పరిష్కారమయిందనుకున్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఎలాంటి వివాదం ఏర్పడకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కానీ తమిళిసై మాత్రం బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.