తెలంగాణ గవర్నర్ తమిళిశై ..రాజ్‌భవన్‌ను సెక్రటేరియట్‌గా మార్చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఎవరికీ తెలియదు. సీఎం ప్రగతి భవన్ నుంచి రారు. దీందో గవర్నర్ సమస్యలపై ప్రభుత్వ పెద్దల కన్నా వేగంగా స్పందిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే వారిని నిరాశ పర్చడం లేదు. భరోసా ఇచ్చి పంపుతున్నారు. ప్రజాదర్భార్ కూడా ప్రారంభించారు. తండాల్లో బసకూ రెడీ అవుతున్నారు. గవర్నర్ వచ్చీ రాగానే.. తెలంగాణ పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగారన తెచ్చుకునేందుకు సమయం కేటాయించారు. ఆ తర్వాత మెల్లగా.. తనదైన పాలన ప్రారంభించారు. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయలన్నింటికీ.. గవర్నర్ చాన్సలర్ గా ఉంటారు. అందుకే.. ముందు యూనివర్శిటీలపై దృష్టి పెట్టారు. తొలుత వర్శిటీల స్థితిగతులపై సమీక్ష చేశారు.
రాజ్యాంగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఈ విషయం లో తమిళిసై.. మెహమాటలకు పోలేదు. అలాగని.. వివాదమూ చేయదల్చుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో.. ఆమె పరిస్థితుల్ని కొన్నాళ్లు పరిశీలించిన తర్వాతే రంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటం.. పిలిచి చర్చిస్తే.. పరిష్కారమయ్యే సమస్యను.. ప్రభుత్వమే కావాలని పెద్దది చేస్తోందన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతనే తమిళిసై… నివేదికతో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ పరిస్థితుల్ని ప్రధాని, హోంమంత్రికి వివరించారు. వారి సలహాలు.. సూచనలు తీసుకుని తిరిగొచ్చారు. తనదైన చర్యలు ప్రారంభించారు. క్యాబ్ డ్రైవర్ సంఘ నేతలను పిలిపించి మాట్లాడారు. సమ్మెను విరమింపచేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు.
కీలకమైన అంశాల్లో మాత్రమే.. కాదు… ప్రజా సమస్యల విషయంలోనూ తమిళిశై… దూకుడుగా ఉంటున్నారు. ట్విట్టర్ చేసే ఫిర్యాదులకూ పరిష్కారం చూపిస్తున్నారు. గవర్నర్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు.. తెలంగాణ గవర్నర్ .. ప్రజాదర్భార్‌ను కూడా దీపావళి సందర్భంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తండాల్లో ఒక రోజు బస చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గిరిజన సంక్షేమ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన తమిళి శై.. గత గవర్నర్ నరసింహన్ లా బ్యూరోక్రాట్ కాదు. ఆమె ఫుల్ టైం పొలిటికల్ లీడర్. బీజేపీకి ఏ మాత్రం బేస్ లేదని భావించే తమిళనాడు లో.. ఆ పార్టీని నడిపించిన నేత. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలు ఎలా చేయాలో ఆమెకు ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఆ విషయాన్ని చేతల ద్వానే చూపిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడున్న వేగంలోనే.. తమిళిసై.. విధులు నిర్వహిస్తే.. రాజ్‌భవన్ త్వరలో.. మరో సచివాలయంగా గుర్తింపు పొందినా ఆశ్చర్యం ఉండదంటున్నారు.