నిర్మాతల కొడుకులు హీరోలవ్వడం సర్వసాధారణమే.. ఆ దారాలోనే లాస్ట్ ఇయర్ తన కొడుకుని తెరంగేట్రం చేయించాడు బెల్లంకొండ సురేష్. అల్లుడు శ్రీను అంటూ వచ్చిన కుర్ర హీరో శ్రీనివాస్ మొదటి సినిమాలోనే టాలీవుడ్ హాట్ అండ్ ఫేవరేట్ బ్యూటీలైన సమంత, తమన్నాలతో రొమాన్స్ చేశాడు. సినిమా మొత్తం సమంతతో చిందులేసిన శ్రీను.. ఐటం సాంగ్లో తమన్నాతో స్టెప్స్ వేశాడు. వినాయక్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. బెల్లంకొండ సురేష్ శ్రీను రెండో సినిమా బోయపాటి శ్రీనుతో చేయిద్దామనుకుంటే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది.
అయితే ప్రసుతం భీమనేని శ్రీనివాస్ డైరక్షన్లో ఓ తమిళ మూవీని రీమేక్ చేస్తున్నాడు సురేష్. సుందరపాడియన్ తమిళ్ సినిమా తెలుగులో శ్రీను హీరోగా చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా సోనారికా బడోరియా చేస్తుండగా మరోసారి తమన్నాతో ఐటం సాంగ్ ని చేయించే ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్. అయితే శ్రీనుతో తమన్నా ఐటం కు రెడీ అయ్యిందట.. దీనికి రెమ్యునరేషన్ గా ఏకంగా 80 లక్షలు తీసుకుందని టాక్.
మొత్తానికి మొదటి సినిమాలో తమన్నా ఐటం సెంటిమెంట్ ని రెండో సినిమాకి కూడా కంటిన్యూ చేయిస్తున్నాడు సురేష్. ఈ సినిమా తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సినిమా శ్రీను సినిమా ప్లాన్ చేస్తున్నాడట. మరి తనయుడి కోసం తపించి పోతున్న బెల్లంకొండ సురేష్ ఐడియాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.