చిరంజీవితో మరోసారి కలసి నటించే అవకాశం అందుకుంది.. తమన్నా. `సైరా` తరవాత `భోళా శంకర్` కోసం చిరుతో జత కట్టబోతోంది. ఈరోజే.. భోళా శంకర్ క్లాప్ కొట్టుకుంది. ఈ సందర్భంగా.. తమన్నా మీడియాతో తన మనసులోని భావాల్ని పంచుకుంది.
”కోవిడ్ లాక్ డౌన్ లాంటి కష్టమైన సమయం తరవాత మెల్లమెల్లగా జనాలు బయటకి వస్తున్నారు. భోళా శంకర్ తో మరింత హోప్ వచ్చింది. ఇలాంటి సినిమాల్ని థియేటర్లో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఈ యేడాది వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నా. బాగా అలసిపోయా. కొంత బ్రేక్తీసుకుని వెకేషన్ కి వెళ్దామనుకున్నా. నా కెరీర్ ప్రారంభంలోనే… మెహర్ గారితో పనిచేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనతో సినిమా చేయకలేకపోయా. `ఈ పాత్ర మీరే చేయాలి.. మీరు చేస్తేనే ఈ పాత్రకు న్యాయం జరుగుతుంది` అని చెప్పి ఒప్పించాడు. అలాంటి నమ్మకం ఉన్నప్పుడు… ఎంత అలసిపోయినా పనిచేయాలనిపిస్తుంది. చిరంజీవిగారితో కలసి మరోసారి నటించే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకూ నేను నా బెస్ట్ చూడలేదు. లుక్స్‌పరంగా, నటన పరంగా.. ఓ కొత్త తమన్నాని చూస్తారు. భోళా శంకర్ లో స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఇన్నేళ్ల తరవాత ఓ సినిమాని రీమేక్ చేస్తున్నామంటే… అందులో కచ్చితంగా చాలా ప్రత్యేకత ఉండాలి. తప్పకుండా అవన్నీ భోళా శంకర్ తో చూస్తారు” అని చెప్పుకొచ్చింది.