పవన్ కళ్యాణ్ … తెలుగు రాజకీయాలలో ప్రస్తుతం మారు మోగుతున్న పేరు. అయితే ఈ పేరు రోజూ మారు మ్రోగదు, సడన్ గా ఏదో ఒక కష్టం గురించో మీరేదైనా విషయం గురించో అతను మీడియా లోకి వస్తాడు లేదా జనం లోకి వెళ్తాడు అప్పుడు మాత్రమే మీడియా కవరేజీ లభిస్తుంది. పూర్తి స్థాయి లో రాజకీయాలలోకి రావడం కోసం అక్టోబర్ నెల దాకా ఆగండి అంటున్న పవన్ కళ్యాణ్ ఆ తరవాత ఎలాంటి వింతలూ విడ్డూరాలు సృష్టిస్తాడో తెలీదు. పవన్ వేసే ప్రతీ అడుగులో , తీసుకునే ప్రతీ నిర్ణయం లో మేము కూడా ఉంటాం అంటూ వెళుతున్న యువత ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. అయితే ప్రజలలోకి రావడం వాళ్ళతో మమేకం అవ్వడం గురించి పవన్ అనేక వంకలు చెబుతున్నాడు .
దీనిమీద తమ్మారెడ్డి భరద్వాజ కాస్త డిఫరెంట్ గా స్పందించారు. ప్రజలలోకి రావడం అంటే సమస్యల గురించి లోతుగా విశ్లేషణ చెయ్యాలి అనీ ప్రజల ఇబ్బందులు వారిలోకి వెళ్లి మాత్రమే తెలుసుకోవాలి కానీ ఎవరో చెప్తే వినడం అనేది నాయకుడి లక్షణం కానేకాదు అంటున్నారు తమ్మారెడ్డి. పవన్ కళ్యాణ్ ప్రజలలోకి వెళ్ళడం చూసిన కుర్రకారు ఆయన్ని చూస్ ఎగబడ్డం మనం చూస్తూనే ఉన్నాం ఇది సెక్యూరిటీ సమస్యగా వస్తోంది. ” ప్రజలలో మంచి మద్దతు ఉన్నప్పుడు ఇలాంటి సెక్యూరిటీ సమస్యలు అతను చెప్పకూడదు. అయితే భద్రతా ఇబ్బందులు ఎప్పుడైనా ఉంటాయి అవి మామూలే.అయితే భద్రతా ఇబ్బందులు ఎప్పుడైనా ఉంటామైన విషయం. ఆ కారణంగానే రాష్ట్రం లో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోగలడు అతను ” అన్నారు తమ్మారెడ్డి. సమస్య మూలల గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు నిజమైన సేవకుడు అవుతాడు నిజమే కదా.