ఆయన అసెంబ్లీ స్పీకర్. మంత్రిగా కూడా చేశారు. తాను ఉంటున్న పదవి గురించి.. ఆ పదవి ఔన్నత్యం గురించి తెలుసో లేదో కానీ ఆయన అనే మాటలు మాత్రం జుగుప్సాకరంగా ఉంటాయి. సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబుపై అందుకున్న బూతుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎవరూ ఏమీ అనకుండా..తన స్పీకర్ హోదాను అడ్డం పెట్టుకుని రెచ్చిపోయే ఆయన.. తాజాగా చంద్రబాబును ఫినిష్ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయనకు బ్లాక్ క్యాట్ కమెండోలు అడ్డుగా ఉన్నారట.
కమాండోల భద్రత లేకపోతే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతే కాదు కమాండోల భద్రత తీసేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎవ్వరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారని … చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ను తొలగించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కేంద్రానికి సిఫార్సు చేస్తానని ఆయన ప్రకటించారు. బ్లాక్ కమాండోస్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అన్నారు తమ్మినేని సీతారాం.
”బ్లాక్ కమాండోస్ ను తీసేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్లు ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఎవడిని ఉద్దరించడానికి చంద్రబాబుకి బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా నేను సెంట్రల్ గవర్న్ మెంట్ కి అప్పీల్ చేస్తున్నా. బ్లాక్ కమాండోస్ ప్రొటెక్షన్ పొందడానికి ఎవరూ అర్హులు కారు. జెడ్ ప్లస్ కేటగిరికి ఎలా ఎల్జిబుల్ అయ్యాడు. దేశంలో చాలామందికి వార్నింగ్ లు ఉన్నాయి. చాలామంది ప్రాణాలకు ప్రమాదం ఉంది. మరి వారందరికీ బ్లాక్ కమాండోస్ ఇస్తారా? ” అని నోటి దురుసు చూపించారు స్పీకర్ తమ్మినేని.
స్పీకర్ మాటల ప్రకారం చూస్తే.. చంద్రబాబును ఫినిష్ చేయడానికి ఆయనకు కమెండోలో అడ్డుగా ఉన్నారు.. వాటిని కూడా తొలగించమని కేంద్రానికి లేఖ రాస్తారట. ఆయన చెప్పడం ఎలా ఉందంటే.. చంద్రబాబు రక్షణ తీసేస్తే.. ఆయనను మేము హత్య చేసేసుకుంటామన్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్ని ఇంత కన్నా దుర్మార్గ స్థాయికి దిగజార్చిన పార్టీ గతంలో లేదు. ఈ నేతలు మాటలు చెబుతున్నారు.. వచ్చే ప్రభుత్వం చేతల్లో చూపిస్తే.. పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.