అమరావతి రాజధానిలో టీడీపీకి ప్రపంచ స్థాయి నగరం కనిపించింది. వైసీపీకి స్మశానం కనిపించింది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరింత విభిన్నంగా.. అక్కడ రాజస్థాన్ ఎడారి కనిపించింది. తమ్మినేని అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నప్పుడు.. రాజస్థాన్ ఏడారిలో వెళ్తున్నట్లుగా ఫీలయ్యారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయనకు అంత వేడిగా.. ఏడారిలా ఎందుకు అనిపించిందో కానీ… నిర్మోహమాటంగా బయట పెట్టేశారు. అంతే కాదు.. చాలా మందికి అలాగే ఉందని.. కాను తాను మాత్రం… బయట పడుతున్నానని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే అందరూ గర్వించేలా ఉండాలి కానీ.. అమరావతిలా ఉండకూడదన్నారు.
తమ్మినేని వ్యాఖ్యలు సహజంగానే … అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎందుకంటే.. అమరావతిని మార్చాలనుకున్నప్పటి నుంచి వైసీపీ నేతలంతా… వరుసగా.. అమరావతిపై అలాంటి ముద్రలే వేస్తున్నారు. అందులో ఓ కులానికి సంబంధించిన దగ్గర్నుంచి అన్న కోణం దగ్గర్నుంచి వరద ముంపు వరకూ చాలా కోణాలున్నాయి. అయితే.. మంత్రులు.. ముఖ్యమంత్రి.. ఇతర నేతలు అలాంటి విమర్శలు చేస్తే.. ఎవరైనా రాజకీయం అనుకుంటారు కానీ.. ఏ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయకూడదో… ఆ పదవిలో ఉండి మాట్లాడటం వల్లే తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.
అమరావతి రాజస్థాన్ ఏడారో.. థార్ ఏడారో కావొచ్చు.. కానీ అది ఆంధ్రప్రదేశ్లో భాగమే. అయినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని కించ పరిచేలా.. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడటమే… చాలా మందికి ఆశ్చర్యకరం. కానీ.. ప్రస్తుతం రాజధాని అమరావతికి అంత మంచి రోజులు కావు. అందుకే… స్మశాననం దగ్గర్నుంచి ఎడారి వరకూ.. అన్ని బిరుదులు పొందుతూ ఉంది.