పీకపోయిన పవన్ కల్యాణ్ పార్టీలో ఎందుకు చేరుతానని మాజీ స్పీకర్, వైసీపీ వదేలిసిన లీడర్ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని జగన్ పీకినవి చాలదా అన్న సెటైర్లు శ్రీకాకుళం రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. పవన్ కూడా పీకితే తమ్మినేని తట్టుకోలేరని అంటున్నారు. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు ఆయన జనసేన వర్గాలను సంప్రదించారని అందరికీ తెలుసు. కానీ అక్కడి నుంచి ఇంకా సమాచారం రాకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.
తమ్మినేని సీతారాంను ఆముదాల వలస ఇంచార్జ్ గా కూడా తీసేశారు. పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. ఎందుకు అని అడిగేవారు కూడా లేరు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో ఆముదాల వలస వైసీపీ ఇంచార్జ్ గా తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తిని నియమించారు. ఆయన తమ్మినేని ఎవరు అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. తన సీనియార్టీని కూడా గౌరవించడం లేదని తమ్మినేని ఫీలవుతున్నారు.
తమ్మినేనిని నాలుగు పీకాలనుకుంటే పవన్ కల్యాణ్‌కు పెద్ద సమయం పట్టదు. ఆయన అసెంబ్లీలో చేసిన నిర్వాకాల గురించి ఇప్పటికే రిపోర్టులు బయటకు వచ్చాయి. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ కేసుతో పరువు తీయాలనుకుంటే పెద్ద సమయం పట్టదు. అయినా తమ్మినేనిని పీకాల్సిన అవసరం ఏముందిలే అని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఆయన మాత్రం ఆగడం లేదు. పీకించుకునేదాకా ఇలాంటిమాటలు మాట్లాడుతూనే ఉంటారేమోనని ఆయన వర్గీయులు మథనపడుతున్నారు.