ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల కిందట ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దుమారం రేగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. మరో వ్యవస్థపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కోర్టులపై ఒత్తిడి పెంచే వ్యూహంలో.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ సీతారాంను ఉపయోగించుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. దీంతో.. సీతారాం.. తాను ఆదర్శప్రాయమైన వ్యక్తిగా.. అలాంటి వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు.
తమ్మినేని సీతారం.. స్పీకర్‌గా ఆదర్శప్రాయుడు ఎలా అయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. రఘురామకృష్ణంరాజు మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని హితోపదేశం చేశారు. పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని కించ పర్చడం సరి కాదని చెప్పుకొచ్చారు. స్పీకర్ పార్టీలకు అతీతంగా ఉంటారు. తన పార్టీ అంతర్గత విషయాలపై అసలు మాట్లాడరు. కానీ తమ్మినేని మాట్లాడేస్తూంటారు. అయినా.. రఘురామకృష్ణంరాజు తరహాలోనే…ఆయన స్పీకర్‌గా సభలోనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ఉన్నారు. సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా స్పీకర్.. సభలో కూడా.. వారు తమ సొంత పార్టీపై విమర్శలు చేయడానికి సమయం ఇస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పినా.. తనకు ఆ విచక్షణాధికారం ఉందంటున్నారు.
స్పీకర్ పదవిలో ఉంటూనే.. చంద్రబాబు గుడ్డలిప్పదీస్తామని ఓ సారి.. మహిళ అని కూడా చూడుకండా.. సోనియా గాంధీని దారుణమైన వ్యాఖ్యలు చేసిన చరిత్ర స్పీకర్‌కు ఉంది. అలాంటి స్పీకర్.. తనను తాను ఆదర్శ ప్రాయుడిగా చెప్పుకుంటూ కోర్టులపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచి.. తాము చేసే చర్యలకు అడ్డం రాకుండా ఉండేలా.. వైసీపీ వ్యూహాన్ని స్పీకర్ ద్వారా అమలు చేయడంలో భాగంగాే.. ఆయనతో ఈ వ్యాఖ్యలు చేయించారని విపక్ష నేతలు..న్యాయనిపుణులు తీవ్రమైన విమర్శలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.