ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశం వివాదాస్పమయింది. ఇప్పుడు అనూహ్యంగా తనది డిగ్రీ డిస్ కంటిన్యూ అంటున్నారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని టీడీపీ బయట పెట్టింది.
స్పీకర్ డిగ్రీ చదవలేదు. కానీ ఆయన హైదరాబాద్లోని ఆ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో చేరారు. అందు కోసం తాను డిగ్రీ కంప్లీట్ చేసినట్లుగా ఓ డిగ్రీని కాలేజీకి సమర్పించారు. ఆ డిగ్రీ నకిలీదని ఆయన చెప్పిన స్టడీ సెంటర్లలో వెరీఫై చేశామని ఆయన అక్కడ చదవలేదు. డిగ్రీ సర్టిఫికెట్లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదు. అసలు ఈ వయసలో ఆయన లా చదవాలని అనుకోవడం ఏమిటి.. .. అందు కోసం నకిలీ డిగ్రీని పెట్టడం ఏమిటన్నది మిస్టరీగా మారింది.
తెలుగుదేశం పార్టీ ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించి.. చివరికి ఆయన పెట్టింది… నకిలీ డిగ్రీ అని ఆధారాలు బయట పెట్టింది. నకిలీ డిగ్రీ ఇచ్చిన తమ్మినేనిపై పోలీసులకు…. ఆయనకు లా అడ్మిషన్ ఇచ్చిన కాలేజీ కానీ… తమ పేరుతో నకిలీ డిగ్రీ తయారు చేశారన్న కారణంగా యూనివర్శిటీ కానీ ఇంకా కేసులు పెట్టలేదు. బహుశా ఎన్నికల తర్వతా ఆయన చిక్కుల్లో పడతారు. అందుకే ఆయన తాను డిగ్రీ చేయలేదని.. డిస్ కంటిన్యూ అని అఫిడవిట్ లో చెబుతున్నారు. కానీ ఆయన డిగ్రీ సర్టిఫికెట్ తో పొందిన అడ్మిషన్ ప్రక్రియను మాత్రం దాచలేరుగా !