ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. శోభానాయుడు గారి ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, కార్యదర్శి పొట్లూరి రవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి వేల మందికి కూచిపూడి నాట్యంలో లో శిక్షణ ఇచ్చి కళారంగానికి ఎనలేని సేవలు చేసారని, తానా సంస్థతో శోభానాయుడు గారికి దశాబ్దాల అనుబంధం ఉందని, పలు మార్లు తానా మహాసభలకు శోభానాయుడు గారు విచ్చేసి నృత్య ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని, 2010 జులై 31 తేదీని “తానా శోభానాయుడు డే” గా డల్లాస్ లో జరుపుకుని అవార్డుతో సత్కరించినట్లు జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.