ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు వాషింగ్టన్ డీసిలో ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, రంగస్థల నటులు, నృత్యకళాకారిణులు, గాయనీగాయకులు, సాహితీవేత్తలు, బిజినెస్ ప్రముఖులు ఇలా ఎంతోమంది హాజరవుతున్నారు.
తానా కాన్ఫరెన్స్‌లో (North American Telugu Community) నిర్వహించే బిజినెస్ సెమినార్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఈ బిజినెస్ సెమినార్లు ఉంటాయి. బిజినెస్ రంగంలో సలహాలు, సూచనలతోపాటు ఆయా రంగాల్లో ఎలా ప్రవేశించాలో, లాభదాయకమైన బిజినెస్ ఎలా చేయాలన్నదానిపై అవగాహనను ఈ సెమినార్లో ప్రసంగించే వక్తలు కలిగిస్తుంటారు. అందుకే ఈ బిజినెస్ సెమినార్‌కు హాజరయ్యేందుకు అమెరికాలో ఉంటున్న ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇతరులు ఉత్సాహం చూపుతుంటారు.
తానా 22వ మహాసభల్లో కూడా బిజినెస్ సెమినార్లను ఏర్పాటు చేసినట్లు ప్రెసిడెంట్ సతీష్ వేమన తెలిపారు. ఈ సెమినార్‌కు (prominent dignitaries) ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ యుఎస్ రాయబారి వినయ్ తుమ్మలపల్లి, రప్పపోర్ట్ మేనెజ్మెంట్ కంపెనీ సిఇఓ గారి రప్పపోర్ట్, యునిసిస్ ఫెడరల్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ వెంకటపతి పువ్వాడ, రిచన్ ఫార్మా సిఇఓ, ఇన్జీనియస్ ఫార్మా ప్రెసిడెంట్ రాజ్ దేవలపల్లి తదితరులు హాజరవుతున్నారు. కపిల్ దేవ్ మంచి వక్త అన్న విషయం తెలిసిందే. లైఫ్‌లో ఎలా ఉండాలో చెప్పడంలో ఆయన దిట్ట. అలాగే వినయ్ తుమ్మలపల్లి వివిధ రంగాల్లో ఎలా ఎదగాలో చెబుతారు. ఇతర బిజినెస్ ప్రముఖులు వ్యాపారవ్యవహారాల్లో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను తమ అనుభవాలతో తెలియజేయనున్నారు.
కమ్యూనిటీకి ఎంతో ఉపయోగపడే ఈ బిజినెస్ సెమినార్లో పలు ముఖ్యమైన అంశాలను కూడా చేర్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అవకాశాలు, ఆ రంగంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు కలుగుతాయో అన్న వివరాలను ఇందులో తెలియజేయనున్నారు. ఫెడరల్ ఐటీ బిజినెస్ అపర్చునిటీస్ అంశంలో ఐటీ రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అవసరమైన మార్గాలను తెలియజేయనున్నారు. పెద్దపెద్ద ఐటీ సంస్థల నుంచి కాంట్రాక్ట్‌లను పొందడం, ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ వంటి విషయాలను ఇందులో వివరిస్తారు. నేడు ఫార్మారంగంలో ఎంతోమంది బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి రంగంలో ఉన్న అవకాశాలు, బిజినెస్ చేయడానికి అవసరమైన సూచనలను, సలహాలను ఇందులో తెలియజేయనున్నారు.
అలాగే ఇబి 5 (investments offered by EB5) ద్వారా లభించే ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవడం వంటివి కూడా నిష్ణాతులు ఈ బిజినెస్ సెమినార్లో వివరించనున్నారు. ఇలాంటి బిజినెస్ సెమినార్లలో పాల్గొనడం వల్ల తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు, ఇతర బిజినెస్ ప్రముఖులతో కూడా వ్యాపార విషయాలను చర్చించుకునే అవకాశం ఉంటుందని, అందువల్ల యువతరం, ఔత్సాహిక పారిశ్రామికవర్గం తప్పనిసరిగా ఈ సెమినార్‌కు హాజరవ్వాలని తానా కాన్ఫరెన్స్ నాయకత్వం కోరుతోంది.
బిజినెస్‌లో మార్గదర్శనం చూపేలా సెమినార్లు – సతీష్ వేమన (TANA President Satish Vemana)
ఔత్సాహికులకు, ఇతరులకు ఎంతో మార్గదర్శనాన్ని అందించేలా ఈ బిజినెస్ సెమినార్‌ను ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది నిష్ణాతులు పాల్గొంటున్నారని, బిజినెస్ చేయడంలో మీకు ఉన్న సందేహాలను కూడా తీర్చే అవకాశం ఉన్నందున అందరూ ఈ బిజినెస్ సెమినార్‌కు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు సతీష్ వేమన కోరారు.
ఇలాంటి మరెన్నో పసందైన కార్యక్రమాలతో, ఆటపాటలతో మీరు మెచ్చేలా, మనసుకు నచ్చేలా కార్యక్రమాలను తిలకించాలంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోరడి. ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ను www.TANA2019.org చూడండి.
Press release by: Indian Clicks, LLC