నందమూరి కుటుంబానికీ, ఎన్టీఆర్‌కీ మధ్య గ్యాప్ ఉందని, వాళ్ల మధ్య మాటల్లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. హరికృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఓ బ్యాచ్.. మిగిలినవాళ్లంతా ఓ బ్యాచ్. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌ని కావాలనే కొంతమంది దూరం పెట్టారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు సైతం అంగీకరిస్తారు. ఆఖరికి తారకరత్నకీ, ఎన్టీఆర్‌కీ మధ్య కూడా సన్నిహిత సంబంధాలు లేవు. కానీ.. తారకరత్న మాత్రం ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి గొడవలూ లేవు, టచ్‌లోనే ఉంటున్నాం… అంటున్నాడు.
”నేనూ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. మేం ముగ్గురం అప్పుడప్పుడూ కలుస్తుంటాం. సరదాగా ఎంజాయ్ చేస్తాం. మామధ్య గొడవల్లేవు. మేం బయట కనిపించనంత మాత్రన కలసి లేం అనుకొంటే ఎలా” అని క్వశ్చన్ చేస్తున్నాడు. తారకరత్న నటించిన రాజా చేయివేస్తే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు తారకరత్న. ఈ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ”ఎన్టీఆర్ వారసుడిగా రాణించడం అంటే మాటలు కాదు. మాపై ఎన్నో అంచనాలుంటాయి. దానికి తగ్గట్టే కష్టపడ్డా. కానీ అదృష్టం కలసి రాలేదు.. ” అంటూ తెగ ఫీలైపోతున్నాడు ఈ హీరో. మరి రాజా చేయివేస్తే తో అయినా ఆ లక్ వెంట వస్తుందేమో చూడాలి.