తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో సంచలన విజయం సాధించినా.. బెంగాల్లో బీజేపీని సీబీఐ వెంటాడుతూనే ఉంది. గతంలో.. శారదా స్కాంలో నిందితులందర్నీ… బీజేపీలో చేర్చుకుని ఆ స్కాంలో విచారణను సీబీఐ పక్కన పెట్టేసింది. ఇంకా తమ పార్టీలో చేరని అతి కొద్ది మందిపై అప్పుడప్పుడూ రెయిడ్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా నారదా స్కాంలో నిందితులంటూ.. ఇద్దరు మంత్రులు.. ఓ ఎమ్మెల్యే.. మరో మాజీ మేయర్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపి ఆ తర్వాత అరెస్ట్ ప్రకటిస్తారని చెబుతున్నారు. బెంగాల్లో దారుణ పరాజయం ఎదురైనప్పటికీ.. బీజేపీ ప్రతిపక్షంగా ఎదిగింది.
తాము సంచలన విజయం సాధించి తీరుతామని అనుకున్న ఆ పార్టీ నేతలకు నిరాశ కలిగింది. ఆ తర్వాత బెంగాల్లో పరిస్థితులు ఏ మాత్రం కుదట పడలేదు. రాజకీయ హింస పేరుతో.. గవర్నర్ నివేదికల వరకూ వెళ్లింది. అప్పుడే రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటున్నారన్న ఆరోపణలూ.. తృణమూల్ వైపు నుంచి వెళ్లాయి. ఇప్పుడు నారదా స్కాం అంటూ ఇద్దరు మంత్రుల్ని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వివిధ కేసుల్లో తృణమూల్ నేతల్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు.
బీజేపీ దూకుడు చూస్తే.. ఎంత భారీ మెజార్టీతో గెలిచినా బెంగాల్లో తృణమూల్‌ను టార్గెట్ చేయడం లేదని.. ప్లాన్ బీ అమలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు మరిన్ని కీలక పరిణామలు జరిగే అవకాశం కనిపిస్తోంది. స్వయంగా గవర్నర్ కూడా.. కార్యక్షేత్రంలోకి దిగి.. రాజకీయ దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడా ఆయనకు నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ హింస బాధితుల్ని బీేజపీ నేతలు తీసుకొచ్చి గవర్నర్‌తో పరామర్శలు ఏర్పాటు చేశారు. ఇక ముందు బెంగాల్లో ప్రజల గురించి పట్టించుకోవడం కన్నా రాజకీయమే ఎక్కువ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.