ముగ్గురు స్నేహిత్తులు బాగా తాగిన మత్తులో ఏం చేశారనే కథతో రూపొందిన హాలీవుడ్ సిన్మా ‘హ్యాంగోవర్’. తెలుగులో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ‘యాక్షన్ త్రీడీ’ పేరుతో ఫ్రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. అయితే… దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘హ్యాంగోవర్’ కాన్సెప్ట్‌కి షార్ట్ఫిల్స్మ్ బ్యాగ్రౌండ్ యాడ్ చేసి ఈ నెల 29న సినిమా చూపించబోతున్నాడు. ‘పెళ్లి చూపులు’తరవాత ఈ డైరెక్టర్ తీసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’. బడ్డీ కామెడీ (స్నేహితులు మధ్య వినోదం) కాన్సెప్ట్ సినిమా. అంటే… ‘హ్యాంగోవర్’ టైప్ అన్నమాట! తరుణ్ భాస్కర్ కూడా అదే చెబుతున్నాడు. ‘‘బడ్డీ కామెడీలో మనకు వెరీ గుడ్ రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ‘హ్యాంగోవర్’ గానీ… ‘జిందగీ నా మిలేంగీ దుబారా’ గానీ! ఆ ఫార్మెట్‌ని ఒక రిఫరెన్స్‌గా తీసుకొని అదే రేంజ్లో ఒక బడ్డీ కామెడీ రావాలని చేసిన ప్రయత్నమే మా సినిమా’’ అని తరుణ్ భాస్కర్ తెలిపాడు. షార్ట్ ఫిల్మ్ తీయాలనుకొన్న కొందరు స్నేహితులు గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేరి ఈ సినిమా కథ. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్‌ని నవ్వించింది. సినిమా ఎలా ఉంటుందో ఈ నెల 29న విడుదలైన తరవాత తెలుస్తుంది.