పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త సినిమా నిన్న ప్రారంభమైంది. ఈ కొత్త సినిమాకు ఆయన దర్శకుడు కాదు… హీరో! తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ ఓ సినిమా నిర్మిస్తున్న చిత్రమిది. చెన్నై ఒకడు సమీర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో అనసూయ కూడా నటిస్తుంది. కెమెరా ముందుకు ఎప్పుడు రావాలని అనుకోలేదు అని.. ఇప్పుడు రావడం ఎగ్జైటింగ్ గా ఉందని తరుణ్ భాస్కర్ అన్నాడు.
హీరోగా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇక డైరెక్షన్ తరుణ్ భాస్కర్ దూరం అనుకునే అభిప్రాయాలకు అతడు చెక్ పెట్టాడు. కార్ వ్యాన్ లో సీక్రెట్ గా కథ రాస్తున్నాను అని తెలిపాడు. హీరోగా చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే తన దర్శకత్వంలో సినిమా ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తరుణ్ భాస్కర్ అన్నాడు. దర్శకుడిగా తాను తీసిన రెండు సినిమాలను ఆదరించినట్లు… హీరోగా చేస్తున్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. మీడియాను పిలవకుండా సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు.