త్రివిక్రమ్ తొలి సినిమా హీరో తరుణ్. వీరి కాంబినేషన్ లో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతోనే త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్రర్వాత వీరి కలయికలో సినిమా రాలేదు. తరుణ్ కూడా సినిమాలు దూరంగా వున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో తరుణ్ రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తరుణ్ కనిపిస్తారని ప్రచారం జరిగింది.
అయితే ఇందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు తరుణ్. మహేశ్ సినిమాలో తాను నటించడం లేదని.. సోషల్మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని చెప్పుకొచ్చారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. పూజాహెగ్డే కథానాయిక. త్వరలోనే ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.