హైదరాబాద్: హేచ్బ్యాక్(చిన్నకార్లు) విభాగంలో మారుతి ఆల్టో, వాగన్ ఆర్, సెలీరియో, హ్యూండాయ్ ఇయాన్, ఐ10, షెవర్లే బీట్, రెనో క్విడ్, ఫోర్డ్ ఫిగో బాగా అమ్ముడు పోతున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికీ పోటీగా టాటా మోటార్స్ సంస్థ రంగంలోకి ‘జీకా’ మోడల్ లాంచింగ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మోడల్ ఫోటోలు, వీడియోలు, స్పెసిఫికేషన్స్‌ను టాటా మోటార్స్ ఇటీవలే మీడియాకు విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లోనే జీకా అదరగొట్టేసి అందరినీ ఆకట్టుకుంటోంది. పైగా ధరను కూడా ఎంట్రీ లెవల్ కార్ల స్థాయిలోనే రు.3.5 లక్షలని ప్రకటించి పోటీ సంస్థలకు షాక్ ఇచ్చింది. మంచి లుక్స్, ధర, బ్రాండ్ నేమ్ ఉండటంతో జీకా మోడల్‌పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. టెక్నాలజీ పరంగా కూడా అత్యాధునిక పరిజ్ఞానాన్ని టాటా సంస్థ ఉపయోగించింది. పెట్రోల్ వెర్షన్‌కు 1.2 లీటర్ల నాలుగు సిలిండర్ల రెవొట్రాన్ ఇంజన్‌ను, డీజెల్ వెర్షన్‌కు 1.0 లీటర్ మూడు సిలిండర్ల రెవొటార్క్ ఇంజన్‌ను వాడారు. మైలేజ్ ఎంత ఇస్తుందనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. టాప్ ఎండ్ కార్లలో వాడే ఏబీఎస్, నేవిగేషన్, ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు అన్నింటినీ ఇచ్చారు. ఇంటీరియర్ స్పేస్ కూడా సగటు చిన్న కార్లకంటే ఎక్కువగానే ఉండటం విశేషం.
ఇంతకాలం క్యాబ్‌లకు ఎక్కువగా వాడుతున్న ఇండికా స్థానంలో దీనిని తీసుకొస్తున్నప్పటికీ, ముందులాగా కాకుండా అన్ని వర్గాలవారినీ, ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకోవాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. అందుకే దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లయనెల్ మెస్సీని నియమించుకుంది. చిన్నకార్ల విభాగంలో రెనో సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘క్విడ్’ మోడల్ మంచి విజయం సాధించగా, జీకా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.