అధికారం కోల్పోయిన తర్వాత దాడులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. దాడుల భయంతో.. ఊరు వదిలి వచ్చేసిన వారికి… ఆశ్రయం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు.. రాజకీయ వర్గాలు, దాడులు నుంచి తమను తాము కాపాడుకునేవారి కోసం… మంగళవారం నుంచి గుంటూరులో.. వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు..ఈ శిబిరం ఆలోచన చేశారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబుతో పాటు పలువురు నేతల్ని కలిసి… తాము ఊళ్లలో ఉండలేకపోతున్నామని.. బయటకు వచ్చి బతకలేకపోతున్నామని ఆవేదన చెందారు. రాను రాను వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతూండటంతో.. చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆశ్రయం ఇవ్వడంతోనే కాకుండా.. కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వారంలో రెండ్రోజులు జిల్లాల్లో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. 5,6 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. పాత కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడాన్ని ఖండిస్తూ.. ఈ పర్యటనలు సాగనున్నాయి. తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైన తర్వాత పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. వరుపుల రాజా పార్టీకి రాజీనామా చేశారు. మరికొంత మందికూడా.. కేసుల భయంతోనే… సైలెంట్ గా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
రాయలసీమలో కన్నా… పల్నాడులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని… టీడీపీ భావిస్తోంది. పల్నాడులో కోడెల సహా… సీనియర్ టీడీపీ నేతలందరికీ.. ఏదో కేసును చుట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానిస్తోంది. ఇక ద్వితీయ శ్రేణి పార్టీ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇక కింది స్థాయి కార్యకర్తలైతే.. ఊళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని టీడీపీ… గట్టిగానే నిర్ణయించుకుంది. నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారు.