గదిలో వేసి కొడితే పిల్లి అయినా పులి అవుతుందన్నట్లుగా ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా మౌనంగా భరించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తిరగబడటం ప్రారంభించారు. గతంలో వైసీపీ వాళ్లు పోలీసుల అండగా వచ్చి వచ్చి రాళ్లు వేస్తే వాళ్లు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులపై ఆరోపణలు .. చేసి వెనక్కి తగ్గేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. రెచ్చగొట్టే వారికి ఎదురుదాడే సమాధానంగా చెబుతున్నారు.
టీడీపీ కార్యకర్తలకు నైతిక బలం ఇచ్చిన “పులివెందుల వైఎస్జే” పరారీ !
అది పులివెందుల నియోజకవర్గం. టీడీపీ కార్యకర్తలు .. చంద్రబాబు ర్యాలీ కోసం గుమికూడిన చోట… కారులో వారి మధ్యకు వచ్చి… కారు టాప్ నుంచి పైకి లేచి … వైసీపీ జెండాలతో రెపరెపలాడిస్తూ మీసం మెలేశాడో వైసీపీ కార్యకర్త. అది వీడియో తీసుకున్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు తిరిగి చూసేసరికి కారుతో పరారయ్యారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కారుకు నెంబర్ లేదు.. వైఎస్జే అనే పేరు ఉంది. దాన్ని చూస్తూంటే.. వైఎస్జేనే పారిపోతున్నారన్న ధైర్యం టీడీపీ కార్యకర్తలకు వచ్చింది . తర్వాత పులివెందులలో జరిగింది ఓ చరిత్ర.
ఇప్పుడు పుంగనూరులో దేనికైనా సిద్ధమని సంకేతాలు
పుంగనూరులో మొదటి నుంచి టీడీపీని టార్గెట్ చేశారు. అంగళ్లు దగ్గర గతంలోనూ టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. ఈ సారి కూడా అలాంటి ప్లాన్ వేశారు. ఉద్దేశపూర్వకంగా సెంటర్లో గుమికూడి.. పోలీసుల అండతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఉద్రిక్తత సృష్టించారు. చంద్రబాబును పుంగనూరు వెళ్లకుండా చేశారు. ఎప్పట్లాగే టీడీపీ వాళ్లు వాళ్ల దెబ్బలు తిని.. పోలీసులపై ఆరోపణలు చేసి వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. తిరగబడ్డారు. దీంతో వైసీపీ నేతలు అడ్రస్ లేకుండా పరారయ్యారు. వైసీపీ నేతల కోసం పని చేసిన పోలీసులు మాత్రం గాయపడ్డారు. చివరికి వాళ్లు కూడా సంఘవిద్రోహశక్తుల్లా టీడీపీ నేతలపై రాళ్లు దాడులు చేయడం విస్మయకరంగా మారింది.
తిరగబడే ధైర్యం వచ్చేసింది.. ఇక తెలుగు తమ్ముళ్లు ఆగుతారా ?
వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయని… టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారో. .. దానికి సిద్ధమవ్వాలని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీకి పోలీసుల అండ ఉంటుంది.. వారిని ఎదుర్కొనేలా… ఎదురుదాడికి దిగాలని … అందుకు క్యాడర్ రెడీ కావాలని కోరుకుంటున్నారు. ఈ సన్నాహాలకు.. వైసీపీ నేతలే బూస్ట్ ఇచ్చారు. పులివెందుల, పుంగనూరు ఘటన తర్వాత ఇక ఎక్కడైనా టీడీపీ కార్యక్రమాలపై పోలీసుల సాయంతో రాళ్ల దాడుల కోసం రావాలంటే వైసీపీ క్యాడర్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.