తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీుకున్నారు. అదే సభా వేదికపై ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటు ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విజయవాడలోని నోవాటెల్లో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ – జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ – జనసేన సీరియస్గా తీసుకుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయమని కూటమి చెబుతోంది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
సమయం తక్కువ ఉన్నప్పటికీ తాడేపల్లి గూడెంలో ఉభయపార్టీల బలప్రదర్శన సభగా నిర్వహించాలని నిర్ణయించారు. రెండు లక్షల మందిని దాదాపుగా పదిజిల్లాల నుంచి తెప్పించి.. అదో పెద్ద సభలా ప్రచారం చేసుకున్న వైసీపీకి గోదావరి జిల్లాల నుంచి పదహిను లక్షల మందితో సభ నిర్వహించి కల్ట్ చూపించాలని టీడీపీ, జనసేన నేతలు డిసైడయ్యారు. వ్యూహాత్మకంగానే గోదావరి జిల్లాలు కవర్ అయ్యేలా ఉమ్మడి సభను నిర్వహిస్తున్నారు. ఆ రెండు జిల్లాల్లో కూటమి స్వీప్ చేయడం ఖాయమన్న అంచనాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నాయి.