రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో కొనసాగుతున్న అన్ని రాజకీయ పార్టీలు, విజయవాడ లేదా గుంటూరులో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయవాడలో గల తమ పార్టీ కార్యాలయమయిన ‘ఆంధ్ర రత్న భవన్’ న్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా చేసుకొని అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నడిపిస్తోంది. తెదేపా కూడా ప్రస్తుతం గుంటూరులో ఉన్న పార్టీ కార్యాలయాన్నే ఆధునీకరించి దానినే పార్టీ ప్రధాన కార్యాలయంగా చేసుకోబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు కూడా దానిపట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అనుచరులు ఈమధ్యనే గుంటూరులోని పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి వెళ్ళారు. ఏప్రిల్ 8న ఉగాది పండుగ రోజున నారా లోకేష్ దానిని ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ అక్కడి నుంచే నిర్వహించబడతాయి. గుంటూరులో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానిక పార్టీ నేతలు అందరూ హర్షిస్తున్నారు.