ఎన్నికల్లో వాలంటీర్లు పోషిస్తున్న పాత్రపై స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన క్లారిటీ రావడంతో తెలుగుదేశం పార్టీ … తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ వాలంటీర్లపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు… బంపర్ ఆఫర్ ప్రకటించారు. తిరుపతి ఎన్నికలో వాలంటీర్లు బెదిరిస్తే ఫొటోలు, వీడియోలు తీసి 75575 54444 నెంబర్‌కు పంపాలని.. అలా పంపితే రూ.10వేలు పారితోషికం ఇస్తామని ఆయన ప్రకటించారు. పంచాయతీ, మున్సిపాలిటీలకు జరిగినవి ఎన్నికలే కాదని .. వైసీపీకి అనుబంధ సంస్థలైన పోలీసులు, వాలంటీర్లతో తెచ్చుకున్న విజయమని మండిపడ్డారు.
ప్రతీ యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించడం.. వారికి సంబంధించిన డేటా మొత్తం వాలంటీర్ దగ్గర ఉండటంతో .. ఎన్నికల సమయంలో వాలంటీర్ ద్వారానే వైసీపీ నేతలు పనులు చక్క బెడుతున్నారు. గతంలో ఫోన్లు స్వాధీనం చేయాలని ఎస్ఈసీ ఆదేశించినా హైకోర్టుకు వెళ్లి మరీ ప్రభుత్వం అనుమతి తీసుకు వచ్చుకుంది. ఇప్పుడు వాలంటీర్లను కంట్రోల్ చేయడమే సగం టాస్క్‌గా.. టీడీపీ భావిస్తోంది. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఆ పని చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని నిర్ణయించుకుంది.
అందుకే.. ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ఇచ్చి.. పాతితోషికం కూడా టీడీపీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా వాలంటీర్లను ఎంత నియంత్రిస్తే.. అంత మేలు అని టీడీపీ నమ్మకంగా ఉంది. అందుకే ప్రత్యేకంగా టాస్క్ పెట్టుకుని మరీ రంగంలోకి దిగింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే.. భవిష్యత్‌లో వాలంటీర్లను ఎలా కంట్రోల్ చేయాలో.. ఓ అవగాహన టీడీపీకి వచ్చే అవకాశం ఉంది.