హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై స్పందించగూడదని తెలుగుదేశంపార్టీ నాయకత్వం తమ నాయకులకు, శ్రేణులకు సూచించింది. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ టీడీపీకి శ్రేయోభిలాషి అని, తమకు సాయంచేసిన ఆయనను తాము గౌరవిస్తామని అన్నారు. సెక్షన్ 8పై ఆయన అభిప్రాయం వ్యక్తిగతమని, ఆయనతో తమకు విబేధాలు లేవని గాలి చెప్పారు. మరోవైపు, అనకాపల్లి ఎంపీ, టీడీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు, పవన్ పార్లమెంటుకు రావాలనుకుంటే తాను అనకాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేస్తానని అన్నారు. పవన్ కల్మషంలేని వ్యక్తి అని, తానుకూడా ఆయన అభిమానినేనని చెప్పారు. సమాచారలోపంవలనే ఆయన సీమాంధ్ర ఎంపీలపై విమర్శలు చేశారని శ్రీనివాసరావు అన్నారు.