ఆనపర్తి సమస్యను టీడీపీ చివరికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపడం ద్వారా పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోంది. మొదట ఆయన తాను టీడీపీని వీడే ప్రశ్నే లేదని టీడీపీ తరపునే టిక్కెట్ కావాలని పట్టుబట్టారు. అనేక సమీకరణాలు చూసినా.. కుదరలేదు. చివరికి బీజేపీ దెందులూరు అడిగింది. ఇవన్నీ కాదు కానీ… నల్లమిల్లినే బీజేపీ తరపున పోటీ చేయించాలని నిర్ణయించారు.
రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పురందేశ్వరికి ఆనపర్తి చాలా కీలకం.అక్కడ మెజార్టీని వీలైనంతగా తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న బీజేపీ అభ్యర్థి .. గతంలో టీడీపీ పై.. చంద్రబాబుపై చేసిన విమర్శల కారణంగా క్యాడర్ ఎవరూ మద్దతివ్వడం లేదు. ఆయన ప్రచారంలో పది మంది కూడా ఉండటం లేదు. ఇలా అయితే మొదటికే మోసం వస్తుందని చివరికి నల్లమిల్లిని ఒప్పించి బీజేపీ తరపున రంగంలోకి దించుతున్నారు. దీనికి నల్లమిల్లి కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
నల్లమిల్లి ఇప్పటికే నియోజకవర్గం మొత్తం యాత్ర చేస్తున్నారు. ఆయనపై సానుభూతి కనిపిస్తోంది. జరిగిన వివాదం అంతా ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వైసీపీ ఈ వివాదాన్ని వ్యూహాత్మకంగా సాగదీసి.. నల్లమిల్లిపై సానుభూతి పెంచేలా చేశారని అనుమానిస్తోంది. పులివెందుల తర్వాత అత్యధిక రెడ్డి సామాజికవర్గం ఉన్న ఆనపర్తిలో నల్లమిల్లి ఏ పార్టీ తరపున పోటీ చేసినా వైసీపీకి గడ్డు పరిస్థితే ఎదురు కానుంది.