తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడుకు గోదావరి తీరంలో ఉత్సాహంగా సాగుతోంది. రాజమహేంద్రవరంలో నిర్వ హించనున్న మహానాడుకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఎన్నికలకు ముందు చివరి మహానాడు కావడంతో ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించనున్నారు. ఈ మహానాడు లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచనున్న అనేక కీలక అంశాలతో పాటు ప్రాథమిక అంశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు.
ఎన్టీఆర్ శత జ యంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. మహానాడులో మొత్తం ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు పార్టీ అధిష్టానం మహానాడు వేదికగా చేయనుం ది.
గత మహానాడును ఒంగోలులో నిర్వహించారు. అప్పటి వరకూ ఎంతో నిరాశగా ఉన్న క్యాడర్..ఒంగోలు మహానాడుకు వెల్లువలా వచ్చిన జనాన్ని చూసినప్పటి నుండి ఓపిక తెచ్చుకుంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. అప్పట్నుంచి జనంలోనే ఉన్న టీడీపీ.. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత అన్ స్టాపబుల్ అన్నట్లుగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎదుర్కొంటున్నారు. ఈ మహానాడు తర్వాత ఇక టీడీపీ పూర్తి స్థాయి ఎన్నికల మూడ్ లోనే ఉండనుంది.