తెలుగుదేశం పార్టీలో క్యాడర్‌కు ఆగ్రహం వస్తే పార్టీ నేతలైనా సారీ చెప్పాల్సిందే. ఆదివారం జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ నేతలకు గట్టి షాక్ తగిలింది. సోషల్ మీడియాలో వారిపై తీవ్రమైన విమర్శలు రావడంతో వెంటనే క్షమాపణలు చెప్పారు. అది రాజకీయపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని అయినా జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. మరోసారి అలాంటి తప్పు జరగనివ్వబోమన్నారు.
నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవరాలు గౌరు శిరీష, మంత్రి పార్థసారధి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి జోగి రమేష్ వచ్చారు. ఆయనను కూడా నిర్వాహకులు పిలిచారు. అలాగే జిల్లాలో ఇతర గౌడ టీడీపీ నేతలు అయినా కాగిత కృష్ణప్రసాద్ తో పాటు ఇతర సీనియర్ నేతల్ని పిలిచారు. జోగి రమేష్ వస్తున్న కారణంగా వారెవరూ రాలేదు. కానీ వీరు వెళ్లడంతో టీడీపీ క్యాడర్ ఫైర్ అయింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని దూషించడమే కాదు.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన నేతలతో కలిసి పర్యటిస్తారా.. కార్యక్రమంలో పాల్గొంటారా అని టీడీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఈ అంశంపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్నారు. అది గౌడసంఘం కార్యక్రమం అని తాము అతిథులుగానే హాజరయ్యామని వారు చెప్పారు. ఇతర అతిథులు ఎవరో తాము గమనించలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో పలువురు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు విషయంలో క్యాడర్ అసహనంతో ఉన్నారని వారి నీడి టీడీపీ.. టీడీపీ నేతలపై పడిన క్యాడర్ సహించే పరిస్థితి లేదని నారా లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు వెంటనే క్యాడర్ కు సారీ చెప్పారు.
టీడీపీ కోసం పని చేసిన క్యాడర్ .. తమ మనోభావాలకు విరుద్దంగా పార్టీ నేతలు వెళ్తే అసలు సహించడం లేదు. గతంలో వేధించిన వారి నీడ టీడీపీపై పడినా సహించడం లేదు.