భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. పై స్థాయి నేతలు మాత్రం ఆసక్తిగా ఉన్నారు. కానీ కింది స్థాయి నేతలు మాత్రం బీజేపీతో పెట్టుకోవడం కన్నా ఖాళీగా ఉండటం మేలన్న అభిప్రాయానికి వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న కారణంగా ఇక్కడి నేతలు చూపించే నోటి దురుసు.. టీడీపీపై చేసే కుట్రలు ఇంకా తమ కళ్ల ముందే ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.
దేశానికి బీజేపీ చేసిన మేలేం లేదని చాలా మంది టీడీపీ నేతలు లెక్కలతో సహా ట్విట్టర్లో వాదిస్తున్నారు. డీపీలు మార్చుకోవడం.. జెండాలు కట్టుకోవడానికి ఇచ్చే పిలుపులు మినహా.. దారుణమైన పరిపాలన అందిస్తున్నారని అంటున్నారు. ఏపీలో రాజధాని, పోలవరం అన్నీ మూలన పడుతున్నా కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయంలో చాలా మంది టీడీపీ క్యాడర్ సానుకూలంగా ఉన్నా.. బీజేపీ విషయంలో మాత్రం నిర్మోహమాటంగా తమ అభిప్రాయం చెబుతున్నారు.
బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ వల్ల … పొత్తు పెట్టుకునే పార్టీకి జరిగే మేలు కొంతే. అయితే .. అయితే ఎక్స్టర్నల్ మ్యాటర్స్అనుకూలంగా మారుతాయని ఎన్నికల్లో గెలవాలంటే అది కూడా ముఖ్యమని వాదిస్తున్నారు. ఈ విషయంలో హైకమాండ్ ఆలోచన ఎలా ఉంటుందో కానీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశంలో టీడీపీ క్యాడర్లో మాత్రం అంత సానుకూలత లేదు.