వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాధలు పడిన వారు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా సరైన చర్యలు తీసుకోవడంలేదని.. అధికార దుర్వినియోగం చేసి తనపై దాడులకు పాల్పడినవారిని ఇంకా ఉపేక్షిస్తున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. వారు తమ అసంతృప్తిని దాచుకోవడం లేదు. బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి వారిలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒకరు.
వైసీపీ తరపున గెలిచినప్పపటికీ జగన్ రెడ్డి సైకోతనాన్ని భరించలేక బయటకు వచ్చేసిన ఆయనకు..ఐదేళ్లు జగన్ నరకం చూపించారు. కనీసం తన నియోజకవర్గానికి వెళ్లకుండా చేశారు. హైదరాబాద్ కు వచ్చినా భయం భయంగా బతికేలా చేశారు. ఓ పుట్టిన రోజు నాడు కనీసం నోటీసులు ఇవ్వకుండా.. ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండాహైదరాబాద్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లి చంపినంత పని చేశారు. ఇలాంటి బాధలు పడిన వారిలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నారు.అయితే ఇతర బాధితులంతా తమపై దాడి చేసిన వారిని శిక్షించాల్సిందేనని కోరుకుంటున్నారు. రఘురామ మాత్రమే ..బహిరంగంగా మాట్లాడుతున్నారు కానీ అందరిలోనూ అదే ఆవేదన కనిపిస్తోంది.
జగన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన వైపీఎస్ అధికారులు కనీసం సస్పెన్షన్ కు గురి కాలేదు. కొంత మందిపై కేసులు పెట్టినా అరెస్టుకు అవకాశం ఉన్నా చేయలేదు. ఎంతో మంది టీడీపీ లీడర్లపై దాడులకు, హత్యాయప్రయత్నాలకు పీఎస్ఆర్ ఆంజనేయులు ప్లాన్ చేశారని పక్కాగా తెలిసినా ఆయనను ఏమీ చేయడం లేదు. చంద్రబాబుపై జరిగిన ప్రతి రాళ్ల దాడి వెనుక ఆయన కుట్ర ఉందన్నది బహిరంగరహస్యం. సీఐడీ చీఫ్లుగా పని చేసిన సునీల్ కుమార్, సంజయ్ ల గురించి చెప్పాల్సిన పని లేదు. వారు అన్ని రకాల బోర్డర్స్ దాటేశారు. వారిని కూటమి ప్రభుత్వం రాగానే జైల్లో పెట్టవచ్చు. మార్గదర్శిని చంపేయడానికి సంజయ్ అత్యంత నీచంగా వ్యవహరించారు. ఇలాంటివి గుర్తు చేసుకున్నప్పుడల్లా టీడీపీ కార్యకర్తలకు ఆవేశం వస్తుంది.
గుర్తొచ్చినప్పుడల్లా ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించడం కామన్ అయిపోయింది. కానీ స్వయంగా బాధితులు అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం.. వారిపై కనికరం చూపిస్తూనే ఉన్నారు. కానీ రఘురామ లాంటి వాళ్లు మాత్రం.. సైలెంటుగా గా ఉండలేకపోతున్నారు.