వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడి.. చంద్రబాబు వ్యాక్సిన్ ఇప్పించాలని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం… అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారంటూ… ఇద్దరు ఎంపీలతో పాటు పలువురు కీలక నేతలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడం.. వైసీపీని ఇబ్బందికర పరిస్థితుల్లో నెడుతోంది. చేత కాకపోతే తక్షణం వైదొలగాలని.. చంద్రబాబు ఒక్క వారం రోజుల్లో ఏపీలో కరోనా పరిస్థితిని కంట్రోల్లో పెడతారని.. టీడీపీ నేతలు సవాల్ చేయడం ప్రారంభించారు.
రాజమండ్రి వైసీపీ నేతల మాటలు.. టీడీపీ నేతల సవాళ్లు… రెండూ హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఈ పాటికి కరోనా కట్టడి కోసం.. ఎంతో సమర్థంగా పని చేసేవారని.. కేంద్రంతో పోరాడో… వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడుకునో ప్రజలకు వ్యాక్సిన్ సమర్థంగా అందించి.. ముప్పు నుంచి కాపాడేవారని ఇప్పటికే కొంత మంది విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు పాలనా సామర్థ్యంపై ఎవరికీ డౌట్లు లేకపోవడంతో .. ఈ చర్చ మెల్లగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇలాంటి సమయంలో… చేతులెత్తేస్తున్నట్లుగా అటు సజ్జల.. ఇటు వైసీపీ నేతలు మాట్లాడటం.. టీడీపీ నేతలకు కలసి వచ్చినట్లుగా ఉంది.
వీలైనంతగా ఏపీ పరిస్థితుల్ని.. చంద్రబాబు ఉండి ఉంటే… అనే కోణంలో ఆవిష్కరించడం ప్రారంభించారు. ఏపీకి వైసీపీ వైరస్ పట్టిందని.. దానికి నారా వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు… కరోనా కంటే చంద్రబాబు నైజం ప్రమాదకమని..ఎదురుదాడి ప్రారంభించారు.