మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి .. అందులో ఉన్నది ఎవరో చెప్పలేమని అనంతపురం ఎస్పీ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపలేదన్నారు. దీంతో టీడీపీ నేతలు అమెరికాలోని ప్రసిద్ధ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను సంప్రదించి.. ఓ సర్టిఫికెట్ తీసుకచ్చారు. ఆ సర్టిఫికెట్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాము అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రకటించారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిర్వహించిన టెస్టులో ఆ వీడియో పూర్తి స్థాయిల ఒరిజినల్ అని తేలిదంన్నారు. అలాగే ఎలాంటి ఎడిటింగ్ లేదని కూడా స్పష్టమైందన్నారు.
మాధవ్ ఎపిసోడ్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా బద్నాం అయిపోయింది. ఆ వీడియో ఫేక్ అని ఒక్కరంటే ఒక్కరూ నమ్మడం లేదు. వైసీపీ నేతలు కూడా నిజమైనదేనని అనుకుంటున్నారు. కానీ ఒప్పుకుంటే మొదటికే మోసం వస్తుందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా అది ఫేక్ కాదని డిసైడైపోయారు. ప్రభుత్వమే అబద్దం చెబుతోందని నిర్ణయానికి వచ్చేశారు. అంటే..ప్రభుత్వం దాదాపుగా బద్నాం అయిపోయింది.మాధవ్‌తో పాటు ప్రభుత్వమూ తప్పు చేసిందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
అయితే టీడీపీ మాత్రం ఇంకా అది రియలేనని నమ్మించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా నుంచి రిపోర్టులు తెచ్చి హడావుడి చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అది నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు అది ఫేక్ అని మరింతగా ఎదురుదాడికి దిగుతారు. అదే చేస్తున్నారు. మాధవ్ ఎపిసోడ్లో అధికార పక్షం పూర్తిగా బ్లేమ్ అయినప్పుడు.. భిన్నమైన వ్యూహం టీడీపీపెట్టుకోవచ్చు కానీ.. ఎందుకు అది నిజమేనని నమ్మించే ప్రయత్నం చేస్తుందో టీడీపీ నేతలకూ అర్థం కాని విషయం.