దొంగ పనులు చేయడం దొరికిపోగానే దొంగ దొంగ అని సిగ్గూ, ఎగ్గూ లేకుండా అరవడం వైసీపీ స్ట్రాటజీలో కీలకం. అందు కోసం బరితెగించేస్తారు. దీనికి తాజాగా ఉదాహరమ దొంగ ఓట్ల ఈసీకి ఫిర్యాదు. ఓటర్ జాబితాను ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తున్న వైనం అన్ని నియోజకవర్గాల్లో బయటపడగానే టీడీపీ పోరాటం ప్రారంభించింది. ఉరవకొండ నియోజకవర్గల్లో ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేశారు. తర్వాత అన్ని నియోజకవర్గాల నుంచి ఘనకార్యాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ దొరికిపోయిన దొంగల స్ట్రాటజీతో… వెంటనే… అదే రోజు తమకూ అపాయింట్ మెంట్ కావాలని.. ఇప్పించుకుని మరీ ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ఈసీకి చేసిన ఫిర్యాదు కాపీలు…. మొత్తం మీడియాకు ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు ఇవ్వలేదు. 2014 నుంచి ఓటర్ జాబితాలో అక్రమాలపై పరిశోధన చేయాలని కోరామని అంటున్నారు. అంటే.. . 2019 ఎన్నికల్లో తమ గెలుపు దొంగ ఓట్ల వల్ల లేకపోతే టీడీపీ ఓట్లను తొలగించడం వల్ల వచ్చిందని అంగీకరించినట్లేనా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫామ్ 7 ను లక్షల సంఖ్యలో నింపి ఇచ్చారు. వాటి ద్వారా ఓట్లను డిలీట్ చేయించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు…. ఓటర్ల ప్రోఫైలింగ్ చేసి మరీ ఓట్లు డిలీట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి సంగతి చెప్పకుండా 2014 నుంచి ఓటర్ల జాబితా అక్రమాలంటూ కొత్త వాదన వినిపిస్తున్నారు. మీ దగ్గర్ ఉన్న ఆధారాలు మీడియాకు ఇవ్వండి అని అడిగితే.. ఇస్తామని చెప్పి… తర్వాత ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఎందుకంటే ఉండాలి కదా ?
మొదటి నుంచి జగన్ రెడ్డి, వైసీపీ స్ట్రాటజీ అదే. ఏ తప్పు చేసినా… మీరు చేయలేదా అని ఎదురుదాడి చేస్తూంటారు. ఎదుటి వారు చేయకపోయినా.. చేసినట్లుగా ప్రచారం చేసి వారు చేశారు కాబట్టి మేము చేశామని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. ఇందు కోసం దొరికిపోగానే దొంగ దొంగ అనే అరుపులు ప్రారంభిస్తారు. రాజకీయంగానే కాదుపాలనా పరంగా ఇదే పద్దతిని చాలా కాలంగా ప్రయోగిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల్లో అవినీతి జరిగిందని రివర్స్ చేసేసి.. మళ్లీ అంత కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంత కంటే దొంగ తెలివితేటలు ఉంటాయా ? .
వైసీపీ నేతలు వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి ఢిల్లీలో ఎలా వ్యవహరిస్తున్నారో… కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఏ వ్యవస్థనీ వదిలి పెట్టకుండా మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత అంశాల్లోనే కాదు.. ప్రభుత్వ నిర్ణయాల విషయంలోనూ వారు చేస్తున్న వ్యవహారాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎప్పుడో ఓ సారి .. దొంగ దొంగ అని అరిచే అవకాశం లేకుండా పట్టుబడటం ఖాయమన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.