తెలుగుదేశం మెంబర్ షిప్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ 73 లక్షలకు పైగా మెంబర్ షిప్‌లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా క్యాడర్, నాయకులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. నూతన సభ్యత్వాలకు తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు టీడీపీలో చేరుతున్నారు.
క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు తయార చేశామని.. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని.. ప్రజలు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదని స్పష్టం చేశారు. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని.. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారని .. కొన్ని నియోజకవర్గాల్లో సరిగ్గా సభ్యత్వాలు జరగకపోవడంపై పరోక్షంగా విమర్శించారు.
పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలిని.. ర్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని హెచ్చరించారు. గతంలోలా ఇప్పుడు పార్టీ సభ్యత్వాలను ఇంట్లో పెట్టుకుని అన్ని పేర్లతో నింపేస్తే పని కావడం లేదు. ఓటర్ ఐడీలతో సహా సభ్యత్వం నమోదు చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ తో పాటు టీడీపీ సంక్షేమం చూస్తుందన్న నమ్మకంతో పార్టీలో చేరే వారు ఎక్కువగా ఉన్నారు.